కేరళలో మెదడును తినే అమీబా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ జబ్బు భారిన పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. తాజాగా కోజికోడ్‌లోని పయోలి ప్రాంతంలో నివశిస్తోన్న మరో యువకుడికి ఈ వ్యాధి సోకింది. తాజాగా ఇవాళ అమీబా వ్యాధి భారినపడి మృదుల్ అనే యువకుడు చనిపోయాడు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి కుంటల్లో రసాయనాలు పిచికారి చేయిస్తోంది. అపరిశుభ్రమైన నీటిలో ఉండే అమీబా ముక్కు ద్వారా మెదడులోకి చేరుతోందని డాక్టర్లు గుర్తించారు. వర్షపు నీరు నిల్వ ఉండే గుంతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
గడచిన వారం రోజుల్లోనే కేరళలోని మలప్పురం, కన్నూర్, అలప్పుజలో ముగ్గురు చనిపోయారు. అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే బ్యాక్టీరియా మెదడులో ప్రవేశించి తినేయడం ద్వారా మృత్యువాతపడుతున్నారు. తాగే నీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు కోరుతున్నారు.