ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సయీద్ జిలిలీతో జరిగిన పోటీలో మసౌద్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 3 కోట్ల మంది పాల్గొన్నారు. మసౌద్‌కు కోటి 60 లక్షల ఓట్లు వచ్చాయి. జలిలీకి కోటి 30 లక్షల ఓట్లు పోలయ్యాయి.
మసౌద్ కార్డియాలజీ నిపుణుడు. దేశంలో సంస్కరణ తీసుకువస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఇందుకు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఇరాన్ ఆంక్షల చట్రం నుంచి బయటపడాలని మసౌద్ ఆకాంక్షిస్తున్నారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జూన్ చివర్లో జరిగాయి. అందులో 60 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. దీంతో జూలై 5న రెండో బ్యాలెట్ నిర్వహించారు. ఇవాళ విడుదలైన ఫలితాల్లో మసౌద్ స్పష్టమైన మెజారిటీ సాధించారు.
మొత్తం ఓట్లలో 50 శాతం సాధించిన వారినే అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. మొదటి ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరికీ 50 శాతం ఓటింగ్ రాకపోవడంతో రెండో దఫా ఎన్నికలు నిర్వహించారు. ఇరాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు ఎన్నికలకు ఆసక్తి చూపకపోవడం వల్లే మొదటిసారి ఎవరికీ 50 శాతం ఓట్లు రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.