ఉత్తరప్రదేశ్ హథ్రస్ తొక్కిసలాట ఘటన తరవాత తొలిసారి భోలేబాబా మీడియా ముందుకు వచ్చారు. జరిగిన విషాద ఘటనపై ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తరవాత చాలా వేదనకు గురైనట్లు చెప్పుకొచ్చారు. భగవంతుడు బాధను భరించే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తొక్కిసలాట బాధితులను శిక్షించాలి, ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని తన అనుచరులను కోరినట్లు భోలేబాబా వెల్లడించారు.
అలీఘడ్తోపాటు, హథ్రాస్‌లో సత్సంగ్ పేరుతో భోలేబాబా పలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు. జులై 2న హథ్రాస్‌లో జరిగిన సత్సంగ్‌కు 80 వేల మంది వస్తారని అంచనా వేశారు. కాని రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. బాబా పాదదూళి కోసం జనం ఒక్కసారిగా నెట్టుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది.