జాతీయ మహిళ కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మపై టీఎంపీ ఎంపీ మహువా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. హథ్రాస్ తొక్కిసలాట ఘటన తరవాత ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన రేఖాశర్మకు ఓ వ్యక్తి గొడుగు పట్టుకోవడంపై ఎంపీ మహువా ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ వ్యక్తి తన యజమాని ఫైజమా ఎత్తిపట్టుకోవడంలో బిజీగా ఉన్నారంటూ రేఖాశర్మకు గొడుగుపట్టే ఫోటోకు వ్యాఖ్యానం పోస్ట్ చేశారు. అది వివాదంగా మారడంతో మహువా దాన్ని తొలగించారు.
ఎంపీ మహువా వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మహువా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. దీనిపై ఎంపీ మహువా స్పందించారు. మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేయాలనుకుంటే నదియాకు రండి అంటూ మహువా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రేఖాశర్మ గతంలో మహాత్మాగాంధీపై చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఆమెపై కేసు నమోదు చేయాలని మహువా ఢిల్లీ పోలీసులను కోరారు.