బహుజన సమాజ్‌వాదీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని పెరంబూరులో ఆయన ఇంటి వద్ద అనుచరులతో మాట్లాతుండగా ఆరుగురు దుండగులు, డెలివరీ బాయ్స్ వేషంలో వచ్చి కత్తులతో దారుణంగా పొడిచి చంపారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఆర్మ్‌స్ట్రాంగ్‌కు కొందరు రౌడీ షీటర్లతో విభేదాలున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ అతనిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. హత్యపై సెంబియం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆరుగురు ఈ హత్యలో పాల్గొన్నట్లు తేల్చారు. ఆర్మ్‌స్ట్రాంగ్ చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.