వాహనరంగంలో మరోమైలు రాయి ఆవిషృతమైంది. ప్రపంచంలో ఎవరూ చేయని సాహసం బజాజ్ కంపెనీ చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సీఎన్జీ గ్యాస్‌తో నడిచే బైక్ విడుదల చేసింది. గ్యాస్ అందుబాటులో లేనప్పుడు పెట్రోల్‌తో నడిచే విధంగా డ్యూయల్ ట్యాంక్ సదుపాయం అమర్చారు. ఫ్రీడమ్ 125 పేరుతో తయారైన గ్యాస్
బైక్‌ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితన్ గడ్కరీ ఢిల్లీలో విడుదల చేశారు.
మూడు వేరియంట్లలో గ్యాస్ బైక్ అందుబాటులోకి వచ్చింది. ఫ్రీడమ్ డిస్క్ ఎల్ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ ఎల్ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ బైకులు శుక్రవారం నుంచి అన్ని బజాజ్ షోరూముల్లో అందుబాటులోకి వచ్చాయి. డిస్క్ ఎల్ఈడీ ధర రూ. లక్షా 10 వేలు, డ్రమ్ ఎల్ఈడీ లక్షా 5 వేలు, డ్రమ్ వేరియంట్ రూ. 95 వేలకే లభిస్తుంది. పెరిగిపోతోన్న పెట్రోల్ ధరల నుంచి ద్విచక్రవాహనాలు వినియోగించే వారు, డబ్బు ఆదా చేసేందుకు ఈ గ్యాస్ బైక్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు