పాములు మనుషులను కరుస్తూ ఉంటాయి. ఇలాంటి వార్తలను తరచూ పత్రికలు, టీవీల్లో వింటూనే ఉంటాం. కానీ బిహార్లో వింత చోటు చేసుకుంది. తనను కరచిన పామును ఓ వ్యక్తి రెండు సార్లు కొరికాడు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.
బిహార్లోని నవడాకు చెందిన సంతోష్ లోహర్ రైల్వే ట్రాకుల వెంట పనులు చేస్తూ ఉంటాడు. ఒక రోజు పని ముగించుకుని క్యాంపులో నిద్రపోయాడు. అక్కడే ఓ పాము కాటేసింది. ఇది గమనించిన సంతోష్ వెంటనే ఆ పామును పట్టుకుని, రెండుసార్టు కొరికాడు. కాటేసిన పాముని కొరికితే విషం విరుగుతుందని అతని నమ్మకం. పాముని సంతోష్ రెండుసార్లు కొరకడంతో అది చనిపోయింది.
ఇది గమనించిన సంతోష్ స్నేహితులు అతన్ని రాజౌలి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంటికి పంపిస్తామని డాక్టర్లు చెబుతున్నారు.