నీట్ యూజీ 2024 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. ఆగష్టు 11న రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నీట్ యూజీ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నీట్ యూజీ 24 పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మార్పులు చేసిన షెడ్యూల్ కాసేపటి కిందట ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా వైద్య విద్య పీజీలో ప్రవేశానికి నీట్ యూజీ నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ చేయాలనుకునే వారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.