ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారంటూ, మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 17న పూర్తి సమాచారంతో హాజరు కావాలంటూ సీబీఐ న్యాయవాదులను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ తీవ్రవాది కాదని, అలాంటి వారితో లింకులు కూడా లేవని, ఢిల్లీకి సీఎంగా, ఆప్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సింఘ్వీ వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సూత్రధారిగా ఉన్నారని బెయిల్ ఇస్తే అప్రూవర్లను బెదిరించే అవకాశం ఉందంటూ సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, జులై 17న పూర్తి సమాచారంతో రావాలంటూ సీబీఐకి నోటీసుల జారీ చేసింది.