న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సూరీ స్వరాజ్ ను నియమిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత బీజేపీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బాన్సూరీ స్వరాజ్ లోక్సభ ఎన్నికల్లో న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి కమలం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎన్డీఎంసీలో సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం ఆమెను నియమించింది.
దిల్లీ మున్సిపాలిటీ సేవలు, పరిపాలనలో ఎన్డీఎంసీ సభ్యులు పాత్ర కీలకం. బడ్జెట్, ఆరోగ్య సదుపాయాలు, స్కూల్స్, నీటి సరఫరా, విద్యుత్, మురుగు, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రజా సేవల అమలు, నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతలు కూడా ఎన్డీఎంసీ సభ్యుల చేతుల్లోనే ఉంటాయి.