ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్క్ష్యంగా ఉత్తరాఖండ్లో గడచిన వారం రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వందకుపైగా రహదారులు తెగిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. చంపావ్, ఆల్మోరా, ఉదంసింగ్నగర్, పితోరాఘర్ జిల్లాల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
రుద్రప్రయాగ్ జిల్లాల్లో అలకనందా నది పొంగడంతో శివయ్య విగ్రహం పది అడుగుల మేర మునిగిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలుసురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, నదుల గట్ల వెంట ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంగా, సరయు, అలకనందా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. బద్రీనాథ్ జాతీయ రహదారిని కూడా మూసివేశారు.