ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మరో రికార్డు సొంతం చేసుకుంది. జులై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 3వ తేదీ సాయంత్రానికి రూ.700 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. రాబోయే కొద్ది రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రముఖ తారాగాణంతో రూ.600 కోట్ల బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి చిత్రం ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది.
అమితాబ్ బచ్చన్ అశ్వద్దామగా అలరించారు. దీపికా పదుకునే, కమల్ హసన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. చివరి సీన్లో ప్రభాస్ కర్ణుడి క్యారెక్టర్‌లో దర్శనం ఇవ్వడంతో కల్కి రెండో పార్ట్‌పై అంచనాలు పెరిగిపోయాయి. కల్కి సెకండ్ పార్ట్ నిర్మాణంపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం