Wild Animals Drowned,అస్సాంను గడగడలాడిస్తున్న వరదలు కజీరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సైతం ముంచేసాయి. అక్కడున్న పలు వన్యప్రాణులు నీట మునిగాయి.
కజీరంగా నేషనల్ పార్క్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం 17 జంతువులు నీట మునిగాయి. వాటిలో ఒక ఖడ్గమృగం పిల్ల, ఒక హాగ్ డీర్ కూడా ఉన్నాయి. మరో 72 వన్యప్రాణులను అధికారులు రక్షించారు. వాటిలో పాతిక జంతువులను అటవీప్రాంతంలోకి వదిలేసారు. 32 జంతువులకు చికిత్స జరుగుతోంది.
కజీరంగా నేషనల్ పార్క్లో వరద పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. అక్కడున్న 173 ఫారెస్ట్ క్యాంప్లు వరదనీటిలో మునిగి ఉన్నాయని పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ సోనాలీ ఘోష్ వెల్లడించారు.
సుమారు వారం రోజులుగా అస్సాంను వణికిస్తున్న వరదల్లో ఇప్పటివరకూ 46మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న బుధవారం 8మంది చనిపోయారు. రాష్ట్రంలో వరద పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. 29 జిల్లాల్లో 16.25 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో 515 పునరావాస కేంద్రాల్లో 3.86లక్షల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. 11.2 లక్షల జంతువులు కూడా వరదల్లో చిక్కుకున్నాయని ఎస్డిఎంఎ అధికారులు వెల్లడించారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ, పేరామిలటరీ తదితర బృందాలు రాష్ట్రంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే 8377మందిని రక్షించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు