కేంద్రప్రభుత్వం పలు కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలతో పాటు దేశ అత్యున్నత నిర్ణయాధికారులకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేస్తూ అధికార నోటిఫికేషన్ను కేంద్రప్రభుత్వం జారీ చేసింది.
నియామకాల కేబినెట్ కమిటీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. భద్రతా వ్యవహారాల కమిటీలో ప్రధాని మోదీ, సహా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సభ్యులుగా ఉన్నారు.
పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీలలో రామ్మోహన్ నాయుడుకు అవకాశం లభించగా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడుతోపాటు కిషన్ రెడ్డికి స్థానం దక్కింది.
కేబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, కేబినెట్ కమిటీ ఆన్ స్కిల్, ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది.