ఉత్తరప్రదేశ్ హథ్రస్లో భోలే బాబా అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. హథ్రస్లో భోలేబాబా పాద ధూళి కోసం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 123కి చేరింది. సత్సంగ్‌కు 50 వేల మంది మాత్రమే హాజరవుతారని భోలేబాబా అనుమతులు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. తొక్కిసలాట జరిగిన రోజు 2.5 లక్షల మంది భక్తులు హాజరయ్యారని పోలీసులు అంచనాకు వచ్చారు. భోలేబాబా పాదధూళి కోసం జనం ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి ఊపిరి ఆడక భక్తులు చనిపోయారని ఇటా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తేల్చారు.
ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటన జరగిన తరవాత భోలే బాబా ఆలియాస్ జగత్ గురు సాకార్ విశ్వహరి పరారయ్యారు. ఆయన ప్రధాన అనుచరులు సికంద్రావ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భోలే బాబా కోసం గాలింపు చేపట్టారు.