ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బుధవారం ఎగువసభకు వచ్చిన ప్రధాని మోదీ, సుధామూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి మంగళవారం నాడు తొలి ప్రసంగం చేశారు. మహిళల ఆరోగ్యం పై మాట్లాడుతూ 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్‌ను తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు అని వివరించారు.
ప్రసంగంలో భాగంగా చికిత్స కంటే నివారణే మేలని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న సుధామూర్తి, ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని, ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్‌ను బాలికలకు అందించడం సులభమేనన్నారు.
అలాగే దేశ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై సుధామూర్తి ప్రసంగించారు. దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుందన్నారరు. సుధామూర్తి ప్రసంగంపై స్పందించిన ప్రధాని మోదీ, మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడారని కొనియాడారు.
గత పదేళ్ళలో తమ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించిందన్నారు. శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ చేశామన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు