ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో 1 1 మంది మావోయిస్టులు చనిపోయారు . నారాయణ్‌పూర్ జిల్లా పరిధిలో జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌లు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
అబూజ్‌మడ్ ఇలాకాలోని కోహక్‌మేట అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు నిర్వహించారు.
గంటన్నరకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు, సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.