అస్సాం వరదల్లో మంగళవారం మునిగిపోయి ముగ్గురు చనిపోయారు. దాంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి పెరిగింది.
అస్సాం ఎస్డిఎంఎ అధికారులు అందించిన వివరాల ప్రకారం… మంగళవారం తిన్సుకియా జిల్లాలో ఇద్దరు, ధెమాజీ జిల్లాలో ఒకరు వరదనీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం రాష్ట్రంలో వరద పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. అస్సాంలోని మొత్తం 28 జిల్లాల్లోనూ సుమారు 11.5 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు.
కామరూప్, తముల్పూర్, చిరాంగ్, మోరిగావ్, లఖీంపూర్, బిశ్వనాథ్, దిబ్రూగఢ్, కరీంగంజ్, ఉదాల్గురి, నగావ్, బొంగైగావ్, సోనిట్పూర్, గోలాఘాట్, హోజాయ్, దర్రాంగ్, చరాయ్దేవ్, నల్బరీ, జోర్హాట్, శివసాగర్, కర్బి ఆంగ్లాంగ్, గోల్పరా, ధెమాజీ, మజులీ, తిన్సుకియా, కోక్రఝార్, బార్పేట, కచార్ జిల్లాల్లో వరద తీవ్రప్రభావం చూపిస్తోంది.
రాష్ట్రంలో 42,476 ఎకరాలు వరదనీటిలో మునిగిపోయాయి. రెండోదశ వరదల్లో 2208 గ్రామాలు నీటమునిగాయి.
బ్రహ్మపుత్ర, సుబన్సిరి, దిఖౌ, దిసాంగ్, జియాభరాలీ, పూథీమారీ, కోపిలి, బెకే, కుషియారా, బరక్, ధాళేశ్వరి నదులు పలు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
అధికార యంత్రాంగం రాష్ట్రంలో 489 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. వాటిలో సుమారు 3లక్షల మంది ప్రజలు తలదాచుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 3వేల మంది ప్రజలను వరద ముప్పు ప్రమాదం నుంచి రక్షించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు