దేశీయ స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్ ఇవాళ రికార్డుస్థాయిలో ప్రారంభమైంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు ప్రధాన గ్లోబల్ ఇండెక్స్‌లో వెయిటేజీ పెరుగుతుందన్న సానుకూల దృక్పథంతో మార్కెట్లలో జోష్ నిండింది.
మార్కెట్లు ప్రారంభమవడంతోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.7శాతం పెరిగి 24,291 పాయింట్లకు చేరుకుంది. బిఎస్ఇ సెన్సెక్స్ 0.72శాతం పెరిగి 80,013.77 పాయింట్లకు చేరుకుంది. సెన్సెక్స్ 80వేల మార్కును అధిగమించడం మార్కెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు షేర్ల విలువ, ట్రేడింగ్ ప్రారంభంలోనే 3.5శాతం పెరిగింది. స్టాక్‌మార్కెట్లలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న బుల్లిష్ ట్రెండ్‌కు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని మార్కెట్ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి.
జూన్‌తో ముగిసే త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు షేర్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు 55శాతం కంటె దిగువకు తగ్గాయి. ఫలితంగా మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంతర్జాతీయ ఇండెక్స్‌లలో ఆ బ్యాంకు వెయిటేజి పెరగవచ్చు. దానివల్ల రాబోయే వారంరోజుల్లో 3నుంచి 4వందల కోట్ల డాలర్ల ఇన్‌ఫ్లో వచ్చే అవకాశముంది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు మార్కెట్లలోనూ హెచ్‌డిఎఫ్‌సి భారీ వెయిటేజ్ ఉన్న స్టాక్ కావడంతో ఈ సానుకూల పరిణామం మార్కెట్లకు కదను తొక్కించింది. మొత్తం 13 మేజర్ సెక్టార్లూ లాభాలు పుంజుకున్నాయి. ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టార్ సుమారు 1.5శాతం పెరిగింది.