ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రతిభాన్పూర్లో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది శివ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రతిభాన్పూర్లో శివారాధన ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఈ ఘోరం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఇటా ఆసుపత్రికి తరలించారు.
తొక్కిసలాటపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి సీఎం బయలు దేరారు. మరణించిన వారిలో 25 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఇటా ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వారు తెలిపారు.