పోన్ పే, గూగుల్ పే, అమెజాన్ యాప్లను ఉపయోగించి కరెంటు బిల్లులు చెల్లించడం ఇక నుంచి సాధ్యం కాదు. రిజర్వు బ్యాంకు నిబంధనలు ప్రకారం జులై 1 నుంచి యూపీఐ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఆన్లైన్ చెల్లింపుల్లో మోసాలకు తావులేకుండా ఉండేందుకు రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల వినియోగదారులు ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా బిల్లులు చెల్లించడానికి వీలవుతుంది.
బిల్లుల చెల్లింపుల్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరగాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. దీని ద్వారా ఖాతాదారులకు భద్రత లభిస్తుంది. కొన్ని బ్యాంకులు, యాప్లు ఇప్పటికీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్తో అనుసంధానం కాలేదు. దీంతో యూపీఐ పేమెంట్లను ఆర్బీఐ నిలిపివేసింది. యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులు కూడా సాధ్యం కాదు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు