అసోంలో వరదలతో 60 మంది మృతి
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా జనజీనవం స్తంభించింది.
అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రజలు ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 60 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. నగాంవ్, డిబ్రుగఢ్ జిల్లాలు, ఇతర పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. నివాసాల్లోకి నీరు చేరడంతో స్థానికులు నానా యాతన పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని అలకనందా నది కూడా ఉగ్రరూపం దాల్చింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో జూలైలో సాధారణం కన్నా అధికవర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్‌లో సాధారణంకన్నా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు