తిరుమలలో నేడు(జూలై 2) మతత్రయ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. జూలై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్ర ఉత్సవాలు టీటీడీ చేపట్టనుంది. ఆ తర్వాత జూలై 15న పెరియళ్వార్ సట్టుమొర, ఆ తర్వాతి రోజు జూలై మ16న పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నారు. జూలై 17న తొలి ఏకాదశి, శయన ఏకాదశి, చాతుర్మాస వ్రతం పండుగులు నిర్వహిస్తారు. జూలై 21న గురుపౌర్ణమి, వ్యాసపౌర్ణమి, ఆషాడ పూర్ణిమ, జూలై 30న ఆడి కృతిక, జూలై 31 సర్వ ఏకాదశి పూజలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై లో నిర్వహించే ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణ వనంలోని శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 4 నుంచి 14 వరకు జరగనున్నాయి. జూలై 10 నుంచి 12 వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం జూలై 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు.
జూలై 17 నుంచి 25 వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరపనున్నారు. ఇక జూలై 18 నుంచి 20 వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 18 నుంచి 22 వరకు శ్రీ విఖనశాచార్య ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 29న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభంకానుంది.