నంద్యాల జిల్లా నూనెపల్లె సచివాలయం కార్యదర్శి సుధారాణి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె నంద్యాలలోని 29వ వార్డు సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తోంది. నూనెపల్లెలోని ఆమె ఇంట్లోని స్నానాల గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆమె పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నంద్యాల పట్టణ మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పింఛన్ల డబ్బు ఆమె వద్ద పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. సుధారాణి అనుమానాస్పద మృతిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.