చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. మే 10న యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరవగా మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు. గత ఏడాది జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకోగా ఈ ఏడాదిలో ఇప్పటికే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించారు.
కేదార్నాథ్ ను 10 లక్షల ఆరు వేలమంది దర్శించుకోగా బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది సందర్శించారు. గంగోత్రిని నాలుగు లక్షల 98వేల మంది , యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించి అనుగ్రహంపొందారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించగా ఈ దఫా ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది.