రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా సైన్యాన్ని కోల్పోయింది. దీంతో ఖైదీలను యుద్ధంలోకి దింపుతోంది. హత్య, అత్యాచారం కేసుల్లో జీవితఖైదు పడిన వారిని మినహాయించి మిగిలిన ఖైదీలను సైన్యంలోకి తీసుకుంటోంది. వారిలో వృద్ధులను, అనారోగ్యంగా ఉన్నవారికి మినహాయింపు నిచ్చింది. ఇప్పటికే 3 వేల మంది ఖైదీలకు శిక్షణ ఇస్తోంది. ఆయుధాలు ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చి వారిని యుద్ధరంగంలోకి దింపుతోంది. మరో 27 వేల మందిని ఖైదీలను కూడా సైన్యంలోకి తీసుకోవాలని ఉక్రెయిన్ ప్రయత్నాలు ప్రారంభించింది.
రష్యాతో యుద్ధ మొదలయ్యాక ఎన్ని వేల మంది చనిపోయారనే దానిపై కీవ్స్ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వేలాది మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయుధాలు అందుతున్నా, యుద్ధం చేసేందుకు సైనికులు లేకపోవడంతో రష్యాను కట్టడి చేయలేకపోతోంది. దీంతో ఖైదీల సేవలను ఉపయోగించుకోవాలని ఉక్రెయిన్ పార్లమెంట్ నిర్ణయించింది. ఖైదీలను సైన్యంలోకి తీసుకోవాలనే బిల్లును ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పటికే 3 వేల మందికి శిక్షణ కూడా ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు