పశ్చిమబెంగాల్లో తాజాగా చోటుచేసుకున్న అరాచకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందించారు. అక్రమ సంబంధం పెట్టుకున్నారనే నెపంతో ఓ జంటపై టీఎంసీ నేత తాజ్ముల్ విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని నడ్డా తప్పుపట్టారు. సందేశ్ఖాళీలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా టీఎంసీ ప్రభుత్వం అరాచక శక్తులను ప్రోత్సహిస్తూనే ఉందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు.
సందేశ్‌ఖాళీ ఘటనలు మరవక ముందే బెంగాల్లో మరో అరాచకం వెలుగు చూసింది. బెంగాల్‌లోని ఉత్తరదినాజ్పూర్, చోప్రా ప్రాంతంలో ఓ జంటను వెదురు కర్రతో టీఎంసీ నేత తాజ్ముల్ విచక్షణా రహితంగా కొట్టారు. ఆ వీడియోలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. బెంగాల్లో మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. బెంగాల్ మహిళలకు ఏ మాత్రం సురక్షితం కాదన్నారు. జంటపై విచక్షణా రహితంగా దాడి చేసిన తాజ్ముల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు