తొలిసారి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు ప్రకటించారు. జులై 6 నుంచి నెల రోజుల పాటు ఆషాడమాసం సారె మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మీడియాకు తెలిపారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
జులై 14న తెలంగాణ మహంకాళి అమ్మవారి బోనాలు దుర్గమ్మకు సమర్పించుకుంటారని ఈవో రామారావు స్పష్టం చేశారు. జులై 19 నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారికి మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేసినట్లు ఈవో ప్రకటించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు