ప్రజా సేవలో వెంకయ్యనాయుడి జీవితం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవిత విశేషాలపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్గా విడుదల చేశారు. సేవలో వెంకయ్యనాయుడి జీవితం, మహానేత వెంకయ్యనాయుడు జీవిత ప్రయాణం, 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం సందేశం అనే పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్ కేంద్రంలో వేలాది మంది ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో మూడు పుస్తకాలను ప్రధాని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు.
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరని ప్రధాన మోదీ కొనియాడారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా వెంకయ్య చేసిన సేవలు మరువలేనివన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఆయన కాలంలోనే 370 ఆర్టికల్ రద్దు బిల్లును విజయవంతంగా తీసుకువచ్చారని కొనియాడారు. ఎమర్జెన్సీ కాలంలో 17 నెలలు జైలు జీవిత గడిపిన వెంకయ్యజీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు.