భారత ఆర్మీచీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. 2022 నుంచి ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తోన్న మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ఆర్మీ చీఫ్‌గా నియమించారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేక పదవుల్లో పనిచేశారు ఆర్మీ వైస్ చీఫ్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. పరమ్ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్టసేవా మెడల్, మూడు సార్లు ఉత్తమ జనరల్ ఆఫీసర్ కమాండర్‌గా పతకాలు పొందారు.
1981 నేషనల్ డిఫెన్స్ అకాడమీ బ్యాచ్‌కు చెందిన జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్ము కశ్మీర్ రైఫిల్స్ 18వ బెటాలియన్‌లో పనిచేశారు. అనంతరం కశ్మీర్ లోయ ప్రాంతంలో, రాజస్థాన్ ఎడారి పాక్ సరిహద్దు ప్రాంతాల్లోనూ జనరల్ ఉపేంద్ర కమాండర్‌గా విధులు నిర్వహించారు. చదువుకునే రోజుల నుంచే ఉపేంద్ర క్రీడల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించారు. మిలటరీ అకాడమీలోనూ గోల్డ్ మెడల్ సాధించారు. పర్వత ప్రాంతాలు, ఎడారులు, ఈశాన్య రాష్ట్రాలలాంటి సంక్లిష్ట ప్రాంతాల్లోనూ ఉపేంద్రకు పనిచేసిన అనుభవం ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు