అయోధ్య రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో తయారు చేసిన ధనుస్సుకు కొండగట్టు అంజన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, అక్కడ ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు.
నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు అయోధ్య రాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు. దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించిన తర్వాత అయోధ్యలో సమర్పిస్తానని తెలిపారు. 13 కిలోల వెండితో పాటు కిలో బంగారంతో ఈ ధనుస్సు తయారు చేయించినట్లు వివరించారు. శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లో దీనికి పూజలు నిర్వహించి, అటు నుంచి రావణుడి సంహారం జరిగిన శ్రీలంకకు తీసుకెళ్తామన్నారు. ఆఖరకు అయోధ్య రామ మందిరంలో సమర్పిస్తామని చెప్పారు. శ్రీనివాస శాస్త్రి అయోధ్యలో భక్తుల కోసం అన్నదాన సత్రం నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో కొండగట్టు అంజన్న క్షేత్ర ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి పాల్గొన్నారు.