జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని అంతర్జాతీయ నిపుణులు పరిశీలిస్తున్నారు. కేంద్ర జలసంఘం సూచనల మేరకు అమెరికా నుంచి డేవిడ్ డి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కూ, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్లను ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, ఎగువ, దిగువ కాపర్డ్యామ్లు, రింగ్ బండ్ దెబ్బతిన్న ప్రాంతాలను నిపుణులు పరిశీలించారు. కొట్టుకుపోయిన రాక్ ఫిల్ ఎర్త్ డ్యామ్ పరిస్థితులను నిపుణులకు వివరించారు.
వచ్చే నెల 3 వరకు అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టు వద్దే ఉండి వివరాలు సేకరించనున్నారు. నిలిచిపోయిన పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నిపణులు సూచనలు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న సంస్థల నిపుణులను కేంద్ర జలసంఘం పంపించింది. వారిచ్చిన సూచనల తరవాత పనులు ప్రారంభించనున్నారు.