టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. జట్టు సభ్యులను అభినందించారు. జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించిన రోహిత్‌శర్మను ప్రశంసించారు. అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టకున్న విరాట్ కోహ్లీని, చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా, అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకున్న సూర్యకుమార్‌ను ప్రశంసించారు. విజయానికి దోహదపడిన కోచ్ ద్రవిడ్‌కు మోదీ అభినందనలు తెలిపారు.
ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత్ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అద్భుతమైన గెలుపుతో 140 కోట్ల మంది భారతీయులు గర్విస్తున్నారు అని పేర్కొన్నారు. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్టు వీడియో సందేశం విడుదల చేశారు.