ఉన్మాదులు రెచ్చిపోయారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం గ్రామ శివారులో ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన ఓ బాలిక శనివారం నాడు అమ్మమ్మ గారి గ్రామం గరువుపాలెం వెళ్లింది. ఇది గమనించిన పెరవలి గ్రామానికి చెందిన వెంకటేశ్, వేణు,సతీష్ బాలికకు మాయ మాటలు చెప్పి గరువుపాలెం శివారు పొలాల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. వీరికి మరో ఇద్దరు స్నేహితులు కూడా తోడు కావడంతో వారు కూడా బాలికపై అత్యాచారానికి దిగారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
బాలిక ఆలస్యంగా ఇంటికి రావడంతో అనుమానంతో ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.