ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బార్ట్ విల్లోమర్ తిరుగు ప్రయాణంలో జాప్యంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. ఆస్ట్రోనాట్స్ భూమికి తిరిగిరావడంలో తలెత్తిన సమస్య అంత ఆందోళనకరం కాదన్నారు. ఐఎస్ఎస్ ఎంతో భద్రమైన ప్రదేశమని, అక్కడ తొమ్మిది మంది వ్యోమగాములు ఉన్నారని గుర్తు చేశారు. వారిలో ఇద్దరు తిరిగిరావడంలో మాత్రమే ఇబ్బందులు తలెత్తాయని వివరించారు.
భూమి నుంచి కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కు రప్పించే లాంచ్ ప్రొవైడర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐఎస్ఎస్ ఓ భద్రమైన ప్రదేశమని ఎంతకాలైమనా అక్కడ ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు.
బోయింగ్ స్ట్రీమ్‌లైనర్లో సాంకేతిక సమస్యలతో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బార్ట్ విల్మోర్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది.
సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలు అందరికీ గర్వకారణమని కొనియాడిన సోమనాథ్, ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి తరలించేందుకు బోయింగ్ సంస్థ స్టార్‌లైనర్ వ్యోమనౌకను నిర్మించింది. స్టార్ లైనర్ సాయంతో సునీతా విలియమ్స్, జూన్ 5న భూమి మీద నుంచి ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. ఆ తరువాత స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారి తిరుగుప్రయాణం ఆలస్యమైంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు