జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, తిరుచ్చి, కుంభకోణం పట్టణాల్లో ఎన్ఐఏ అధికారులు గత అర్థరాత్రి నుంచి సోదాలు చేస్తున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన కీలక సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.
నిషేధిత సంస్థలకు కొందరు సహకరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పలువురి ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థలకు పనిచేస్తున్నారనే అనుమానాలతో జాతీయ దర్యాప్తు సంస్థ తమిళనాడులోని దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.