ఉత్తర భారతాన్ని అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గడచిన మూడు రోజుల్లో కురిసిన అతి భారీ వర్షాలకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారంనాడు వసంత్ విహార్ ప్రాంతంలో గోడ కూలి ముగ్గురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గడచిన 8 దశాబ్దాల్లో లేని విధంగా ఢిల్లీలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట ముగిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. అండర్ పాస్ బ్రిడ్జిల్లో నీరు చేరడంతో అందులో మునిగిపోయి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కులు, మనాలి ప్రాంతాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండ చరియలు విరిగిపడి రవాణాకు అంతరాయం ఏర్పడింది. అస్సాంను గడచిన పదిహేను రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు లక్షా 33 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే 4 రోజుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు