ఢిల్లి లిక్కర్ విధాన రూపకల్పనలో అవకతవకల ద్వారా మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారనే కేసు ఎదుర్కొంటోన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు రిమాండ్ విధించింది. కేసు విచారణలో కేజ్రీవాల్ సహకరించడం లేదని, జుడీషియల్ కస్టడీకి అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.
ఢిల్లి మద్యం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కాసేపట్లో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను జుడీషియల్ కస్టడీకి తీసుకునే అవకాశముంది. జైల్లోనే కేజ్రీవాల్‌ను ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.