కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీశ్ కుమార్, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మెలిక పెట్టారు. ఇవాళ పాట్నాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలంటూ తీర్మానం చేశారు. దీనికి పార్టీ సభ్యులు ఆమోదించారు.
ఎన్డీయేలో చేరి ఎలాంటి షరతులు లేవంటూనే సీఎం నితీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరమేదకు తేవడం రాజకీయ దుమారం రేపుతోంది. మరోవైపు నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాంటూ నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటే విధంగా చట్టాలు తీసుకురావాలన్నారు.