ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు.
1999లో ఖానాపూర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ రాథోడ్, 2009లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. తరవాత కాలంలో టీఆర్ఎస్లో చేరారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన సొంతూరు ఉట్నూరుకు తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.