యుజిసి-ఎన్ఇటి జూన్ 2024 పరీక్ష, సిఎస్ఐఆర్-యుజిసి-ఎన్ఇటి ఉమ్మడి పరీక్ష, ఎన్‌సిఇటి 2024 పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కొత్త తేదీలు ప్రకటించింది.
యుజిసి-నెట్ పరీక్ష ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్యలో నిర్వహిస్తారు. జాయింట్ సిఎస్ఐఆర్-యుజిసి-నెట్ పరీక్ష జులై 25 నుంచి 27 వరకూ నిర్వహిస్తారు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష జులై 10న నిర్వహిస్తారు.
ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారితంగా ఉంటాయి. యుజిసి-నెట్ జూన్ 2024 సైకిల్ ఎగ్జామ్‌ను రాతపూర్వకంగా నిర్వహించారు. అయితే ఇప్పుడు మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) పద్ధతిలో నిర్వహిస్తారు.
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎఐఎపిజిఇటి) 2024 పరీక్ష, షెడ్యూల్ ప్రకారమే అంటే జులై 6న జరుగుతుంది.
మరింత సమాచారం కోసం అభ్యర్ధులు ఎన్‌టిఎ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. (www.nta.ac.in)
యుజిసి-నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 18న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ‘‘ఉన్నతస్థాయి పారదర్శకత, పరీక్షల ప్రక్రియ స్వచ్ఛతను కాపాడడానికి ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ జూన్ 19న ప్రకటించింది.