పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షల నిర్వహణలో లోపాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మృతిచెందిన మాజీ ఎంపీలకు సంతాపం తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సభ్యులు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్ ఓం బిర్లా. అయితే విపక్షాలు మాత్రం నీట్‌పై చర్చకు పట్టుబట్టాయి. ఎంత సేపటికి వారు శాంతించకపవడంతో మొదట సభను 12 గంటలకు వాయిదా వేశారు. 12 గంటలకు సమావేశమైన తరవాత కూడా విపక్ష సభ్యులు పట్టువీడలేదు. నీట్‌పై చర్చ జరపాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు నీట్‌పై చర్చకు పట్టుబట్టారు. అయినా సభను కొనసాగించే ప్రయత్నం చేశారు ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్. ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే విపక్షాలు నీట్‌పై చర్చ చేపట్టాలంటూ నిరసన తెలిపాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను మొదట 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తరవాత కూడా విపక్ష సభ్యుల తీరులో మార్పు రాకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్ సభను జులై 1వ తేదీకి వాయిదా వేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు