నకిలీ పత్రాల ద్వారా భూ కుంభకోణానికి పాల్పడి, మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు శుక్రవారంనాడు రాంచీ కోర్టు బెయిల్ మాంజూరు చేసింది. భూ కుంభకోణంలో కోట్లాది రూపాయల మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారంటూ గత జనవరి 31న సుదీర్ఘ విచారణ తరవాత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.నకిలీ పత్రాల ద్వారా భూ కుంభకోణానికి పాల్పడంతోపాటు, కోట్లాది రూపాయలు దారి మళ్లించారని హేమంత్ సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సీఎం పదవిలో ఉండగా అరెస్టైన మొదటి వ్యక్తిగా హేమంత్ సోరెన్ నిలిచారు. మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లాక రాజీనామా సమర్పించాడు. మరలా ఇప్పుడు బెయిల్ లభించడంతో జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్‌ను కొనసాగిస్తారా, రాజీనామా చేయిస్తారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.