ఆన్లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే నెల రోజుల్లో రెట్టింపు లాభాలు ఇస్తామంటూ ఆన్లైన్ ప్రకటనలు చూసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన రాధిన భారీగా నష్టపోయింది. ఆన్లైన్ ట్రేడింగ్ క్లాసులకు హాజరైన రాధిక, మొదట చిన్న మొత్తంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టింది. మొదట రూ.30వేలు లాభాలు వచ్చాయంటూ మోసగాళ్లు చెప్పారు. ఆ తరవాత దశల వారీగా రూ.59 లక్షలు నష్టపోయింది.
మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని, వాటిని బదిలీ చేయాలంటూ 30 శాతం కమిషన్ చెల్లించాలని రాధికకు చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. మోసపోయినట్లు గ్రహించి చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్‌కు చెందిన ముఠా ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.