అమర్నాథ్ యాత్ర ఈ నెల 29న ప్రారంభం కానుంది. శుక్రవారంనాడు మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనుంది. జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ల జారీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి యాత్రీకులు వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సరస్వతీ ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి సైతం నలుగురు భక్తులు వచ్చారు.
ఇటీవల ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. భారీగా సాయుధులను మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాలతో పహారాను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రతి 500 మీటర్లకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.