అనారోగ్యంతో బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వాని కాసేపటి కిందట డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గత కొంత కాలంగా మూత్రకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఎయిమ్స్ యూరాలజీ వైద్యులు అద్వానికి చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు.
అద్వాని అనారోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. పెద్ద సమస్య కాదని, వెంటనే ఆయన కోలుకున్నారని డాక్టర్లు చెప్పారు. అద్వాని ఆరోగ్య పరిస్థితులపై మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న అతి ప్రచారాన్ని నమ్మవద్దని ఎయిమ్స్ డాక్టర్లు వెల్లడించారు.