వికీలీక్స్ అధినేత అసాంజే ఎట్టకేలకు బ్రిటన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబంధించిన పేపర్ల లీకులో అసాంజే ఐదేళ్లుగా బ్రిటన్ జైల్లో మగ్గుతున్నారు. ఇటీవల నేరాన్ని అంగీకరించడంతో ఆయన్ను బుధవారం జైలు నుంచి విడుదల చేశారు.
జైలు నుంచి విడుదలైన అసాంజే ప్రత్యేక విమానంలో తన సొంత దేశం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అసాంజే తండ్రి జాన్ షిప్టన్, భార్య స్వాగతం పలికారు. తమ పోరాటం వల్లే అసాంజే జైలు నుంచి విడుదలయ్యారని భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికా రక్షణ శాఖ పత్రాలను వికీలీక్స్ ద్వారా బహిర్గత పరచిన కేసులో అసాంజే కీలక నిందితుడిగా ఉన్నసంగతి తెలిసిందే.