ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నీరభ్ కుమార్ ప్రసాద్ జులై మొదటి వారంలో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.. పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. దీంతో ఆయన పదవీ కాలన్ని పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డా మళ్ళీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. చంద్రబాబు అభ్యర్థన మేరకు లడ్డాను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న లడ్డా, ఏపీ కేడర్ కు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ అధికారుల సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు, లడ్డాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది.