ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ విధింపు అని పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు అనుభవించిన బాధలు గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ విరుద్ధ శక్తులకు వ్యతిరేకంగా దేశం విజయం సాధించిందన్నారు. 18వ లోక్‌సభ కొలువుదీరడంతో పార్లమెంటులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నాయని ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా దేశమంతా తీవ్రంగా ఖండించాలన్నారు. ఇక సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించడాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తు చేశారు. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో బయటపడిన అవకతవకలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాల్లో, పరీక్షల నిర్వహణలో పవిత్రత ఉండాలన్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో విచారణ జరుగుతోందన్నారు. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు