బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఒక బ్రిడ్జి కూలిపోయింది. ఆ రాష్ట్రంలో వారం వ్యవధిలో బ్రిడ్జి కూలిపోయిన సంఘటనల్లో ఇది నాలుగవది.
కిషన్‌గంజ్ జిల్లాలో బహదూర్‌గంజ్, దిఘాల్‌బంక్ పట్టణాలను కలుపుతూ, కంకాయ్ నదికి ఉపనది అయిన మదియా నది మీద నిర్మించిన 70 మీటర్ల బ్రిడ్జి ఈ మధ్యాహ్నం కూలిపోయింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు అవలేదు. ఈ బ్రిడ్జి నిర్మించి ఆరు సంవత్సరాలు అయింది.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకాయ్ నదిలో నీటిమట్టం పెరిగింది. వడి కూడా ఎక్కువగా ఉండడంతో, బ్రిడ్జి మధ్యభాగంలోని చాలావరకూ స్తంభాలు సుమారు రెండు అడుగుల వరకూ నీట మునిగిపోయాయి.
బ్రిడ్జి మధ్యభాగం బలహీనంగా ఉండడంతో కుంగిపోయింది. కొన్నిచోట్ల బ్రిడ్జి, కింద వడిగా పారుతున్న నదిని దాదాపు తాకేలా దిగిపోయింది. స్థానికుల ఆందోళనలను నిజం చేస్తూ ఆ బ్రిడ్జి ఇవాళ కూలిపోయింది.
విషయం తెలిసిన వెంటనే బహదూర్‌గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదికి రెండువైపులా బ్యారికేడ్లు పెట్టి, వాహనాల రాకపోకలను నిలిపివేసారు. రహదారుల శాఖ అధికారులు కూడా అక్కడకు చేరుకుని, బ్రిడ్జి కూలిపోడానికి కారణాల గురించి దర్యాప్తు ప్రారంభించారు.
‘‘నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో నదిలో నీటిమట్టం ఆకస్మికంగా పెరిగిపోయింది. నదీప్రవాహపు వేగాన్ని బ్రిడ్జి స్తంభాల్లో ఒకటి తట్టుకోలేకపోయింది. పిల్లర్ కుంగిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది’’ అని, ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ తుషార్ సింగ్లా వివరించారు.
గత వారంరోజుల వ్యవధిలో సివాన్, అరారియా జిల్లాల్లో బ్రిడ్జిలు కూలిపోయిన మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ళుగా ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ పనుల నాణ్యత మీద సందేహాలు తలెత్తుతున్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు